royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaబోనం ఎత్తిన 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత– జహంగీర్……… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:39 pm
Date of Publish : 20 Jul 2026, 6:24 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 36 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

బోనం ఎత్తిన 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత– జహంగీర్…… అంటువ్యాధులు, విషజ్వరాలు దరిచేరకుండా అమ్మవారిని వేడుకున్న భక్తులు

బోనం ఎత్తిన 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత– జహంగీర్…… అంటువ్యాధులు, విషజ్వరాలు దరిచేరకుండా అమ్మవారిని వేడుకున్న భక్తులు

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 19/ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు భువనగిరిలో భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. పట్టణంలోని కోట మైసమ్మ గ్రామదేవత ఆలయంలో తొలిసారిగా కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాన్ని ఘనంగా సమర్పించారు. వర్షాకాలంలో కొత్త నీరు, వాతావరణ మార్పులతో ప్రబలే అంటువ్యాధులు, విషజ్వరాల నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత–జహంగీర్ బోనం ఎత్తి కోట మైసమ్మకు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు, తలంబ్రాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల జైజైధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోతం శెట్టి మంజుల, కౌన్సిలర్లు బెండస్వరూపా - లాల్ రాజ్, జాలిగం విగ్నేష్,కుమ్మర్ల పెద్ద తాడూరి బాలమల్లయ్య, తాడూరి కిష్టయ్య, తాడూరి నరసింహ, బండారు రవివర్ధన్ కాల్య నాగరాజు, మాటూరి ఆంజనేయులు, గాయపాక స్వామి, గుడ్డెంకి లక్ష్మీ నరసయ్య, గోపి బాబు, బర్రె క్రాంతి,ఎడ్ల భరత్ తదితరులు పాల్గొన్నారు