royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఇన్నర్ వీల్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:43 pm
Date of Publish : 18 Jul 2026, 6:14 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 56 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 18/ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ భువనగిరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం భువనగిరి పట్టణంలో ఈ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ నూతన ప్రెసిడెంట్ గా పెండం స్వాతి, సెక్రటరీగా చింత ఉమ మరియు గక్కుల సుభాషిని మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు పాస్ట్ ప్రెసిడెంట్ లావణ్య సెక్రటరీ వెంకమ్మ గారిని వారు చేసిన సేవ కార్యక్రమాలకు గాను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా బండారు జై శ్రీ గారు పాస్టర్ ప్రెసిడెంట్ మరియు సి డబ్ల్యూ సి చైర్మన్ గారు వ్యవహరించారు. ఈ ఇన్సులేషన్ కార్యక్రమానికి రోటరీ క్లబ్ బోనగిరి ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు సభ్యులు హాజరై నూతన కార్యవర్గానికి వారి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి సభ్యులు రోటరీ సభ్యులు మరియు మిత్రుడు శుభాభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం నందు ఇన్నర్ వేల్ క్లబ్ నూతన ప్రెసిడెంట్ స్వాతి గారు మిత్రులు క్లబ్ సభ్యులు, రోటరీ సభ్యులు సహకారంతో ఆటిజంతో బాధపడుతున్న కవల చిన్నారుల కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ప్రమాణ స్వీకారం రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారుల భవిష్యత్తు కోసం సహకరించిన ఇనార్వెల్ క్లబ్ సభ్యులను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.