royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఉచిత శిక్షణ.. ఉపాధికల్పన మహిళలకు కుట్టు, ఫ్యాషన్ డిజైనింగ్ లో… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 8:39 pm
Date of Publish : 18 Jul 2026, 4:36 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 34 💬 0
Latest News > తెలంగాణ > హైదరాబాద్

ఉచిత శిక్షణ.. ఉపాధికల్పన మహిళలకు కుట్టు, ఫ్యాషన్ డిజైనింగ్ లో తర్ఫీదు..హిందూ స్మశాన వాటిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

ఉచిత శిక్షణ.. ఉపాధికల్పన మహిళలకు కుట్టు, ఫ్యాషన్ డిజైనింగ్ లో తర్ఫీదు..హిందూ స్మశాన వాటిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, న్యూస్,జూలై 17: మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆర్ధికంగా ఎదిగి సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేస్తున్నారు. ఇందు కోసం కాచిగూడ హరాస్ పెంట లో మహిళలకు ఉపాధి పథకాల్లో శిక్షణ ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్నదనడంలో సందేహం లేదు.

శ్రీప్రసన్నాంజనేయ స్వామి ప్రాంగణంలో..

కాచిగూడ, హరాస్ పెంట లోని హిందూ స్మశాన వాటిక ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని హాల్లో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. మహిళలకు కుట్టు, మగ్గం, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ తదితరాల వాటిల్లో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు బ్యాచ్ ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. 3 నెలల పాటు శిక్షన ఇచ్చి సర్టిఫికెట్లను అందజేస్తామని ట్రస్ట్ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ తెలిపారు. యువతులతో పాటు గృహిణులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు.

ఆధునిక శిక్షణ తరగతులు

హిందూ స్మశాన వాటిక ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం, బ్యూటీషియన్లలో ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిని స్వయం ఉపాధి వైపు బాటలు వేయిస్తోంది. కాచిగూడ, నింబోలిఅడ్డలో అధిక శాతం సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. వీరే వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి అద్దె ఇళ్ళు, అతి కొద్దిమంది సొంత నివాసాల్లో ఉంటున్నారు. ప్రతి కుటుంబంలో సంపాదించే వారు మగవారే కావడంతో గృహిణిలు ఇంటి పనికే పరిమితమవుతున్నారు. ఇలాంటి వారికి ప్రతి బ్యాచ్లో 40 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మహిళా సాధికారతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ హిందూ స్మశానవాటిక ప్రశంసలందుకొంటోంది.

సామాజిక సేవల్లో..

మహిళలకు ఉచిత కుటు శిక్షణ, మెహిందీ, ఫ్యాషన్, బ్యూటీషియన్, మగ్గం, ఎంబ్రాయిడరీ తదితర విభాగాల్లో శిక్షణతో పాటు ఉచితంగా పేద ప్రజల కోసం క్లినిక్ను నడుపుతున్నాం. జనరల్ వైద్యంతో పాటు ఫిజియోథెరఫీ, హోమియోపతి, తదితర ఉచిత వైద్య సేవలను అందిస్తున్నాం. వివిధ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రుల సహాకారంతో ఉచిత వైద్య శిభిరాలను నిర్వహిస్తూ పేదలకు ఉచిత వైద్య ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. త్వరలో న్యాయ సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం.

రాజేందర్ పటేల్ గౌడ్, అధ్యక్షుడు హిందూ స్మశాన వాటిక

మహిళలు ఆత్మగౌరవంతో బతకడానికి శిక్షణ దోహదం మహిళలు ఆత్మగౌరవంతో బతకడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇప్పటికే వందలాది మంది మహిళలు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్స్ను అందించడంతో పాటు ఉపాధి వైపు పయనించేలా తగిన ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నాం.

  • మొగిళ్ల లలిత, శిక్షకురాలు