royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaనీట్‌లో రేసోమెడికాన్ విద్యార్థుల సత్తా..655 మార్కులతో శ్యాం కరన్‌కు టాప్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 2:02 pm
Date of Publish : 18 Jul 2026, 4:31 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 12 💬 0
Latest News > తెలంగాణ > హనుమకొండ

నీట్‌లో రేసోమెడికాన్ విద్యార్థుల సత్తా..655 మార్కులతో శ్యాం కరన్‌కు టాప్ స్కోర్

నీట్‌లో రేసోమెడికాన్ విద్యార్థుల సత్తా..655 మార్కులతో శ్యాం కరన్‌కు టాప్ స్కోర్

హనుమకొండ,జూలై 17 రాయల్ పోస్ట్ న్యూస్ /

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ -2026) లో హనుమకొండకు చెందిన రేసోమెడికాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు.ఎన్‌టీఏ విడుదల చేసిన ఫలితాల్లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ,ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత సాధించే స్థాయిలో నిలిచారని సంస్థ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో కె.శ్యాం కరన్ 655 మార్కులతో ముందంజలో నిలవగా,పి.గురురాజ్ రెడ్డి 630,బి.కోమల్ 591,బి.అభిషేక్ 580,సి.హెచ్.సాక్షి 546,మహమ్మద్ అద్నాన్ 528,ఎన్.మణిదీప్ 528,వేముల జస్విన్ ప్రీత్ 500 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ,వరంగల్–హనుమకొండ జిల్లాల్లో ప్రత్యేక బైపిసి క్యాంపస్‌తో పాటు నీట్‌కు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.జాతీయ స్థాయి అనుభవం కలిగిన అధ్యాపకులు,వ్యక్తిగత పర్యవేక్షణతో బోధన అందించడం వల్ల ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని జిల్లాల విద్యార్థులు,తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు.సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిరావు మాట్లాడుతూ,ఈ ఏడాది మరో 56 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించి ఫ్రీ మెడికల్ సీట్లకు అవకాశాలు మెరుగుపరుచుకున్నారని తెలిపారు.ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు,అధ్యాపకులు,తల్లిదండ్రులకు సంస్థ యాజమాన్యం అభినందనలు తెలిపింది.నీట్-2026 ఫలితాల సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో మేనేజింగ్ డైరెక్టర్ దీప్తిరావు,డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి,మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి,సీఈఓ లెక్కల రమ్యారాజిరెడ్డి, ప్రిన్సిపల్,అధ్యాపకులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.