royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaగ్రామీణ విద్యార్థులకు ఐఓసీఎల్ సేవలు అమోఘం… భువనగిరి ఎంపీ చామల… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:22 pm
Date of Publish : 16 Jul 2026, 5:40 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 10 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

గ్రామీణ విద్యార్థులకు ఐఓసీఎల్ సేవలు అమోఘం… భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

గ్రామీణ విద్యార్థులకు ఐఓసీఎల్ సేవలు అమోఘం…  భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

రాయల్ పోస్ట్ న్యూస్ జులై 15/: యాదాద్రి జిల్లా ప్రతినిధి

గ్రామీణ ప్రాంత విద్యాద్రి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యాజమాన్యం చేపడుతున్న సేవలు అమోఘమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
బుధవారం భువనగిరిలోని కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల విద్యాలయంలో ఐఓసీఎల్, నిర్మాణ్ సంస్థల ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ ల్యాబ్‌తో పాటు పలు మౌలిక సదుపాయాలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపి చామల మాట్లడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ముందుకు వచ్చి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.3.65 కోట్ల వ్యయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో ఐ-స్పార్క్ ల్యాబ్‌లు, బంకర్ బెడ్స్, సోలార్ ఫెన్సింగ్, మెష్ డోర్లు, కిటికీలు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను గుర్తించి, వారు కోరుకున్న రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకునేలా ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నిర్మాణ్ సంస్థలు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొంటూ, సంస్థల
ప్రతినిధులను అభినందించారు.
ఐఓసీఎల్ ప్రతినిధులు ఎలిమరన్, కైలాష్ కాంత్ మాట్లాడుతూ ప్రభుత్వంతో కలిసి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు అనురాధ, నీరజ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో తమ వంతు సహకారంకొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి, భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేష్ చిస్తీ, సెక్టోరియల్ అధికారులు సీహెచ్ రాధ, పెసరు లింగారెడ్డి, మండల విద్యాధికారి సీహెచ్ రంగరాజన్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు