(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం జులై 15:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల తాసిల్దార్ చిన్న అప్పలనాయుడు కి అమీర్పేట్ గ్రామ సర్వేనెంబర్ 171 లో గల ముస్లిం స్మశాన వాటిక కబురస్థాన్ విస్తీర్ణం 11 గుంటల భూమి అన్యాకృతం కాకుండావక్ఫ్ బోర్డు మరియు మండల సర్వేయర్ గారిచే జాయింట్ సర్వే నిర్వహించాలని వినతి పత్రము సమర్పించారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ జలాలుద్దీన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్, అమీర్పేట్ గ్రామ ముస్లిం కమిటీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మిస్కిన్, అమీర్పేట గ్రామ ముస్లింలు మమ్మద్ హబీబ్దిన్, మహమ్మద్ నూరుద్దీన్, మొహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు