royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaయూత్ కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:02 pm
Date of Publish : 14 Jul 2026, 8:03 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 39 💬 0
Latest News > తెలంగాణ > మేడ్చల్-మల్కాజిగిరి

యూత్ కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు…

యూత్ కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు…

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 14/

ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో యూత్ కాంగ్రెస్ ఆరవ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ యుద్దీన్ తన దుకాణం వద్ద ప్రత్యేకంగా ఎస్‌ఐఆర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియపై అవగాహన కల్పించి, ఇనుమరేషన్ ఫారములను ఎలా నింపాలనే విషయంపై సూచనలు అందించారు.

అలాగే ఫారములు నింపడంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తూ, ప్రతి అర్హ ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో పేర్లు సరిచూసుకొని అవసరమైన వివరాలను సమర్పించడం ద్వారా తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని మహమ్మద్ రఫీ యుద్దీన్ సూచించారు.

ఈ హెల్ప్ డెస్క్ ద్వారా స్థానిక ప్రజలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.