royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:58 pm
Date of Publish : 14 Jul 2026, 7:01 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 86 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కు వినతి….

వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ కు వినతి….

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 14/

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వక్ఫ్ బోర్డు ఆస్తులను, స్థలాలను రక్షించాలని, అసుర్ ఖాన, పీర్ల కొట్టంల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం
హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ కు, భువనగిరి షియా కమిటీ సెక్రటరీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భువనగిరి షియా కమిటీ సెక్రటరీ సయ్యద్ కల్బ్ హుస్సేన్ అబెది మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని విలువైన వక్ఫ్ భూముల, స్థలాల రక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలోని
చారిత్రాత్మక అషూర్ ఖానాల (పీర్లకొట్టం ) పునరుద్ధరణతో పాటు దర్గాలు, మసీదుల పరిధిలో ఉన్న ఎంతో విలువైన వక్ఫ్ ఆస్తులను కాపాడటం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. ప్రస్తుతం అనేక విలువైన వక్ఫ్ భూములను కొందరు భూ ఆక్రమదారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో భూ బకాసురులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ​శిథిలావస్థకు చేరుకుంటున్న పురాతన అషూర్ ఖానాలను రక్షించేందుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఇవి ఖండ్రాలుగా మారుతున్నాయని, వక్ఫ్ బోర్డు అధికారులు జిల్లాల్లో పర్యటించి, రెవెన్యూ శాఖతో కలిసి వక్ఫ్ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, విలువైన ఆస్తుల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సయ్యద్ కాల్బ్ హుస్సేన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కోరారు.