royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaకాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరుజాతీయ..బీసీ మహాసభ అధ్యక్షుడు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 2:02 pm
Date of Publish : 14 Jul 2026, 3:04 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 20 💬 0
Latest News > తెలంగాణ > హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరుజాతీయ..బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్

కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరుజాతీయ..బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జులై 13: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అస్త వ్యస్థంగా తయారైందని రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ ఆరోపించారు. సోమవారం కాచిగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కనీస వసతులను కల్పించడంలో సీఎం పూర్తిగా విఫలమైనాడని, నరూర్ నగర్ లోని బాలికల హాస్టళ్ల దుస్తితే నిదర్శనమని ద్వజమెత్తారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మంచినీరు, మరుగుదొడ్లు, భోజన వసతులను కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని, నిరుద్యోగులకు యేడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, దానికితోడు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల శాశ్వతంగా విద్యను దూరం చేయడం కోసమే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ యాజమాన్యాలకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పి. కృష్ణ, భూషన్ భాస్కర్, ముత్యాల్ రావు, ప్రశాంత్ నిమ్కర్, సత్యపాల్ సింగ్, ప్రదీప్ గౌడ్, పాల్గొన్నారు.