royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana › గజ్వేల్‌లో సేవా కార్యక్రమాలతో ఎన్‌.సి. సంతోష్ జన్మదిన వేడుకలు….. గజ్వేల్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 ✈ in @ ✉
royalpost.co.in 05 Nov 2026, 1:10 pm
Date of Publish : 11 Jul 2026, 9:04 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 36 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

గజ్వేల్‌లో సేవా కార్యక్రమాలతో ఎన్‌.సి. సంతోష్ జన్మదిన వేడుకలు….. గజ్వేల్ పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు

గజ్వేల్‌లో సేవా కార్యక్రమాలతో ఎన్‌.సి. సంతోష్ జన్మదిన వేడుకలు…..   గజ్వేల్ పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు

రాయల్ పోస్ట్ న్యూస్ గజ్వెల్ జులై 11/ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బిఆర్ఎస్ నాయకులు, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌.సి. సంతోష్ జన్మదిన వేడుకలు శనివారం సేవా భావం, భక్తి భావంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ వ్యాప్తంగా పలు సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ద్వారకా వెంచర్‌లో మొక్కలు నాటి, నేమింగ్ బోర్డులను ప్రారంభించారు. అంగడిపేట్ ఆంజనేయస్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎర్రవల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల డిజిటల్ విద్యా భవిష్యత్తు కోసం ఒక ఎల్‌ఈడీ టీవీని బహుకరించి, చిన్నారులకు బిస్కెట్లను అందజేశారు. స్థానిక గజ్వేల్ కోర్టు ప్రాంగణంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి కూలింగ్ వాటర్ డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పద్మ బాయి నర్సింగరావు, నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్, అయ్యప్ప దేవాలయం ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌.సి. సంతోష్ జన్మదినాన్ని ఆడంబరాలకు పోకుండా, సమాజానికి ఉపయోగపడే వినూత్న రీతిలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. తాత రాజయ్య రాజకీయ స్ఫూర్తితో, తండ్రి ఎన్‌.సి. రాజమౌళి అడుగుజాడల్లో నడుస్తూ సంతోష్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.