royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..16వ వార్డు కౌన్సిలర్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 1:28 pm
Date of Publish : 10 Jul 2026, 8:04 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 14 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..16వ వార్డు కౌన్సిలర్ నాయిని సత్య లక్ష్మి యాదగిరి

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..16వ వార్డు కౌన్సిలర్ నాయిని సత్య లక్ష్మి యాదగిరి

గజ్వేల్, 10 జూలై 2026  రాయల్ పోస్ట్ న్యూస్ /సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో శుక్రవారం రోజున 'శానిటేషన్ డ్రై డే - ఫ్రైడే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నాయిని సత్య లక్ష్మి యాదగిరి వార్డులో పర్యటించి, ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పాడైపోయిన ప్లాస్టిక్ డ్రమ్ములు, పాత సామాన్లు, టైర్లు, కూలర్ల వంటి వాటిలో వర్షపు నీరు చేరకుండా జాగ్రత్త వహించాలన్నారు. అలాగే, పారిశుధ్యం మరియు దోమల నివారణపై వార్డు వ్యాప్తంగా ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.