royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు అండగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు…సీనియర్ నాయకులు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 8:40 pm
Date of Publish : 07 Jul 2026, 5:12 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 25 💬 0
Latest News > తెలంగాణ > సిద్దిపేట

ఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు అండగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు…సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగ రావు

ఓటర్ల జాబితా సవరణలో ప్రజలకు అండగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు…సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగ రావు

గజ్వేల్, రాయల్ పోస్ట్ న్యూస్ 07 జూలై 2026ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పర్యవేక్షణలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సేవలందిస్తున్నాయని గజ్వేల్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుల ఆదేశాలు, సూచనల మేరకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పార్టీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ నర్సింగ రావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణ, తొలగింపుల ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు మా పార్టీ కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు. ఇందులో భాగంగానే మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులతో అనుసంధానం చేశామన్నారు. ఓటర్లకు ఎదురవుతున్న సాంకేతిక, ఇతర సమస్యలను బిఎల్ఏలు, బిఎల్ఓలతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పుల కోసం అవసరమైన ఎస్ఐఆర్ పత్రాలను నింపడంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఓటర్లకు దగ్గరుండి సహాయం అందిస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు శ్రేణులు కష్టపడుతున్నారాని, ప్రజలకు సేవ చేయడంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఈ సవరణ ప్రక్రియను గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షులు నవాజ్, వార్డుల ఇన్‌చార్జులు, బిఎల్ఏలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.