royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమున్సిపాలిటీలో ముమ్మరంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ…హెల్ప్ డెస్క్‌లను పరిశీలించిన… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:02 pm
Date of Publish : 07 Jul 2026, 12:48 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 29 💬 0
Latest News > తెలంగాణ > సిద్దిపేట

మున్సిపాలిటీలో ముమ్మరంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ…హెల్ప్ డెస్క్‌లను పరిశీలించిన మున్సిపల్ అధికారులు, వైస్ చైర్‌పర్సన్

మున్సిపాలిటీలో ముమ్మరంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ…హెల్ప్ డెస్క్‌లను పరిశీలించిన మున్సిపల్ అధికారులు, వైస్ చైర్‌పర్సన్

రాయల్ పోస్ట్ న్యూస్ గజ్వెల్ , 06 జూలై 2026 :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎస్.ఐ.ఆర్. హెల్ప్ డెస్క్‌లను మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, మేనేజర్ బాలకిషన్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కల్యాణ్ కార్ పద్మాభాయ్ నర్సింగరావు సోమవారం ఉమ్మడిగా పరిశీలించారు. హెల్ప్ డెస్క్‌ల వద్ద ఓటర్ల నమోదు, సవరణలు జరుగుతున్న తీరును వారు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కల్యాణ్ కార్ పద్మాభాయ్ నర్సింగరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పట్టణంలోని ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఎస్.ఐ.ఆర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు అందరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు కార్డులో తప్పులు ఉన్నా, చిరునామా మారినా సవరణల కోసం ఈ హెల్ప్ డెస్క్‌ల సేవలను వినియోగించుకోవచ్చు అన్నారు. మున్సిపల్ యంత్రాంగం ఓటరు జాబితాను పక్కాగా, ఎలాంటి తప్పులు లేకుండా రూపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, ఎస్.ఐ.ఆర్ ప్రతినిధులు (బి.ఎల్.ఓ.), స్థానిక ప్రజలు పాల్గొన్నారు.