royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaస్టడీ సర్కిల్, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి…..… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:46 pm
Date of Publish : 05 Jul 2026, 6:17 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 36 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

స్టడీ సర్కిల్, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి….. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని వెంటనే పునర్నియమించాలి..బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

స్టడీ  సర్కిల్, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి…..  జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని వెంటనే పునర్నియమించాలి..బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 7/జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్, నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, అలాగే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (DVMC)ని వెంటనే పునర్నియమించాలని బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆయన ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా బర్రె జహంగీర్ మాట్లాడుతూ, గతంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహించబడేదని, అయితే గత రెండేళ్లుగా అది నిలిచిపోవడంతో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందలేకపోతున్నారని, ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన వసతులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జిల్లా కేంద్రంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసి లైబ్రరీ, కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్ వనరులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.
అలాగే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పదవీకాలం ముగిసి దాదాపు 18 నెలలు గడిచినా నూతన కమిటీని ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలు, వివక్ష ఘటనలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సమీక్ష సమావేశాలు జరగకపోవడంతో బాధితులకు న్యాయం ఆలస్యమవుతోందని, ప్రభుత్వ సహాయ పథకాలు, రిలీఫ్ కూడా ఏళ్ల తరబడి అందడం లేదని పేర్కొన్నారు.
అందువల్ల వెంటనే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని పునర్నియమించి, సమీక్ష సమావేశాలను ప్రారంభించి బాధితులకు సత్వర న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, విజిలెన్స్ కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్, బండారు రవివర్ధన్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ మాదిగ, ఇటుకల దేవేందర్ మాదిగ, నల్ల కృష్ణ, ఇంజ మహేష్, సురేష్, అందె సాయి, ఎండి కరీం తదితరులు పాల్గొన్నారు.