royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఅంబేద్కర్ భవన ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం.. దళిత సంఘాల ఆగ్రహంకలెక్టర్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:47 pm
Date of Publish : 04 Jul 2026, 8:23 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 22 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

అంబేద్కర్ భవన ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం.. దళిత సంఘాల ఆగ్రహంకలెక్టర్ మూడుసార్లు వస్తానని చెప్పి రాకపోవడంపై తీవ్ర నిరసనభవనాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి…బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

అంబేద్కర్ భవన ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం.. దళిత సంఘాల ఆగ్రహంకలెక్టర్ మూడుసార్లు వస్తానని చెప్పి రాకపోవడంపై తీవ్ర నిరసనభవనాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి…బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 3/యాదాద్రి - భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవం అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర జాప్యానికి గురవుతోందని దళిత సంఘాల నాయకులు బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దళిత సమాజం ఎదురుచూస్తున్న ఈ భవనం ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.
అంబేద్కర్ భవనం అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలకు ప్రతీక అని వారు అన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు భవన నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి, భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గతంలో మూడుసార్లు అంబేద్కర్ భవనాన్ని పరిశీలించేందుకు వస్తానని హామీ ఇచ్చి కూడా రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. అధికారులు ఇకనైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దళిత నాయకులు నాగారం అంజయ్య, బర్రె సుదర్శన్, బండారు రవివర్ధన్, ఇటుకల దేవేందర్ మాదిగ, సురుపంగా శివలింగం, నల్ల కృష్ణ, దుబ్బ రామకృష్ణ మాదిగ, అందే సాయి, కనుకుంట్ల రమేష్ కోటి, బుచ్చల స్వామి, మంచాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.