royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana › జూలై 4న దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతియాదాద్రి భువనగిరి జిల్లాలో… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 ✈ in @ ✉
royalpost.co.in 08 Nov 2026, 3:13 am
Date of Publish : 02 Jul 2026, 7:34 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 2188 💬 15
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

జూలై 4న దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతియాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహిద్దాం- GMPS జిల్లా అధ్యక్షులు మద్దెపురం రాజు

జూలై 4న దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతియాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహిద్దాం- GMPS జిల్లా అధ్యక్షులు మద్దెపురం రాజు

రాయల్ పోస్ట్ న్యూస్ గుండాల జులై 2/ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి జూలై 4న యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు పిలుపునిచ్చారు. గురువారం భువనగిరిలో పత్రికా ప్రకటన విడుదల చేసి విలేఖరులతో ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో రైతులు,మహిళలు,అణగారిన వర్గాలపై జరిగిన దోపిడీ,అన్యాయాలు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన భూమి భుక్తి కోసం వెట్టి నుండి విముక్తి కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.ఆయన త్యాగం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిందని,అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంధ్రాలు,పట్టణాలు గ్రామాల్లో దొడ్డి కొమురయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం,ర్యాలీలు,సాంస్కృతిక కార్యక్రమాలు,చర్చా వేదికలు నిర్వహించాలని సూచించారు.ముఖ్యంగా యువతకు దొడ్డి కొమురయ్య పోరాట గాథను పరిచయం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
విద్యార్థి,యువజన సంఘాలు, వృత్తిదారులు పరస్పర సమన్వయంతో ముందుకు వచ్చి వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.అలాగే దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం,సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.అమరవీరుడు దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ, యన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి భావితరాలకు స్ఫూర్తి నిలపాలని ఈ సందర్భంగా మద్దెపురం రాజు విజ్ఞప్తి చేశారు.