రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి జులై 2/ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అణచివేత రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూడటం అత్యంత దుర్మార్గమని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, ఉద్యమ నాయకుడు కప్పాటి పాండురంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను, పార్టీ నాయకులను అర్ధరాత్రి వేళల్లో ముందస్తుగా, అక్రమంగా గృహ నిర్బంధాలు మరియు అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ప్యూచర్ సిటీ పోలీస్ కమీషనరెట్ కందుకూరు పి.ఎస్ పరిదిలోని బాచుపల్లిలోని తమ నివాసగృహాం లో పాండురంగా రెడ్డిని తెల్లవారుజామున అక్రమ అరెస్టును నిరసిస్తూ విలేఖరులకు అందజేసిన పత్రకా ప్రకటనలో పాండురంగారెడ్డి మాట్లాడుతూ
ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ సాగుతున్న ఈ నిర్బంధ పాలనపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ… "తెలంగాణ సిద్ధాంతం కోసం, స్వరాష్ట్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వంచిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఇప్పుడు 'ఉద్యమకారుల గుర్తింపు కమిటీ' పేరుతో కాలయాపన చేయడం సరికాదు. ఉద్యమకారులకు ఇస్తామన్న ఇంటి స్థలాలు, ఇతర హామీలు మరియు హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేస్తుంటే.. సహించలేక ఖాకీలను ప్రయోగించి అక్రమ అరెస్టులు చేయించడం ఈ ప్రభుత్వ నిరంకుశత్వానికి అద్దం పడుతోంది."
ఎన్నికల నాడు ఓట్ల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోమంటే.. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడమేనా ప్రజా పాలనా విధానం?
ప్రజా సమస్యలపై, ఉద్యమకారుల ఆవేదనపై గళమెత్తితే సంకెళ్లు వేసి భయభ్రాంతులకు గురిచేస్తారా? ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి, హక్కుల కోసం పోరాడే వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య వ్యతిరేకం.
ప్రభుత్వం ఇప్పటికైనా అణచివేత ధోరణిని వీడి, తక్షణమే కాలయాపన చేయకుండా ఉద్యమకారులందరికీ ఇచ్చిన ఇండ్ల స్థలాల హామీని, ఇతర వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని కప్పాటి పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను, ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.