royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaహయత్‌నగర్‌లో హనీ మోటార్స్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ ప్రారంభం… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:48 pm
Date of Publish : 02 Jul 2026, 3:22 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 70 💬 10
Latest News > తెలంగాణ > హైదరాబాద్

హయత్‌నగర్‌లో హనీ మోటార్స్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ ప్రారంభం…

హయత్‌నగర్‌లో హనీ మోటార్స్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ ప్రారంభం…

హయత్‌నగర్, జూలై 2 రాయల్ పోస్ట్ హయత్‌నగర్ పాత జాతీయ రహదారికి ఆనుకుని నూతనంగా ఏర్పాటు చేసిన హనీ మోటార్స్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ కేంద్రాన్ని హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గురువారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తూ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్థానికంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన కార్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటవడం హయత్‌నగర్ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్, సంస్థ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.