royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaరైతు వేదికలో వైభవంగా ‘రైతు భరోసా’.. రైతుల్లో హర్షాతిరేకాలు…. ముఖ్య… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:46 pm
Date of Publish : 30 Jun 2026, 10:04 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 36 💬 4
Latest News

రైతు వేదికలో వైభవంగా ‘రైతు భరోసా’.. రైతుల్లో హర్షాతిరేకాలు…. ముఖ్య మంత్రి రైతు భరోసా విడుదల సందర్భంగా భువనగిరిలో సంబరాలు

రైతు వేదికలో వైభవంగా ‘రైతు భరోసా’.. రైతుల్లో హర్షాతిరేకాలు…. ముఖ్య మంత్రి రైతు భరోసా విడుదల సందర్భంగా భువనగిరిలో సంబరాలు

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ప్రతినిధి:రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు ప్రతిష్టాత్మకంగా ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కోలాహలం నెలకొంది. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ , మున్సిపల్ చైర్మన్ తంగళ్పెల్లి వాణి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను జమ చేయడాన్ని హర్షిస్తూ రైతు వేదికలో సంబరాలు జరిగారు.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ రైతు భరోసా నిధులు రైతులకు పెట్టుబడి సహాయంగా ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ సంబరాలలో స్థానిక ఆర్డీఓ (RDO) , జిల్లా వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓ (MPDO) దీనకర్, ఆయా , మల్లేష్ , వార్డ్ కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమకు సకాలంలో పెట్టుబడి సాయం అందుతుండటం పట్ల ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.