రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 29/.... 23వ వార్డు అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కౌన్సిలర్ బర్రె పూజిత ఆవేదన
భువనగిరి మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత - జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి కౌన్సిల్ సమావేశంలోనే ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు కౌన్సిల్లో పెట్టమని ఎండార్స్ చేసిన, మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన బాబు జగ్జీవన్ రామ్ భవన్ మరమ్మతులు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె విమర్శించారు.
అదేవిధంగా, 23వ వార్డులోని స్థలంలో ఓంకార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఏర్పాటు చేసే వినాయక మండపానికి శాశ్వత భవనం నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, అయితే ఆ ప్రతిపాదనను ఇప్పటి వరకు కౌన్సిల్‌లో ప్రవేశపెట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు అందించిన ఈ వార్డుకు నాలుగు నెలలు గడిచినా ఒక్క రూపాయి అభివృద్ధి నిధులు కూడా కేటాయించకపోవడం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రెండు బోర్‌వెల్ ఫిల్లింగ్ పనులు చేపట్టాలని చైర్మన్, కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులను పలుమార్లు కోరినా స్పందన లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కౌన్సిల్ ఆమోదం కోసం ప్రతిపాదించిన బిల్లులు కోట్ల రూపాయల ప్రజాధనం ఏ విధంగా వృధా అవుతుందో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి కమిషన్లు పొందాలని తాపత్రయం తప్ప వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి 23వ వార్డు అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని కౌన్సిలర్ బర్రె పూజిత - జహంగీర్ డిమాండ్ చేశారు.