royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఈ నెల 30 న కళాశాలల బంద్….. బీసీ యువజన… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 10:55 pm
Date of Publish : 29 Jun 2026, 1:49 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 61 💬 9
Latest News > తెలంగాణ > సూర్యాపేట

ఈ నెల 30 న కళాశాలల బంద్….. బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

ఈ నెల 30 న కళాశాలల బంద్…..  బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

రాయల్ పోస్ట్ న్యూస్ మిర్యాలగూడ జూన్ 29/ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య గారి పిలుపుమేరకు ఈ నెల 30 న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా బీసీ విద్యార్థుల పెండింగ్ ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ నుంచి వచ్చే స్కాలర్షిప్ రాకపోవడంతో కళాశాల.యాజమాన్యాల విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం బీసీ విద్యార్థులకు మాత్రమే బకాయిలు ఇవ్వకుండా బీసీ విద్యార్థులను చిన్నచూపు చూస్తుంది బీసీ విద్యార్థులను ప్రభుత్వం చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు ఒకపక్క న్యాయస్థానం విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోమని యాజమాన్యాలకు వసలు బాటు ఇవ్వడంతో కళాశాల యాజమాన్యాల నిర్ణయించిన ఫీజులకు పేద వర్గాలు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో విద్యకు దూరమవుతూ కూలీ పనులు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇకనైనా స్పందించి మా బీసీ విద్యార్థుల పెండింగ్ ఫీజులను పూర్తిస్థాయిలో విడుదల చేయకపోతే సచివాలయం ముట్టడిస్తామని ఆయన విచారించారు ఈ నెల 30న జరిగే కళాశాల బంద్ కి కళాశాల యాజమాన్యాలందరూ సహకరించాలని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, మిర్యాలగూడ బీసీ జేఏసీ కన్వీనర్ దాసరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చిలకల మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు