royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaతాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:57 pm
Date of Publish : 24 Jun 2026, 7:32 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 107 💬 11
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

తాజ్పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు నూతన జీవం..

తాజ్పూర్  గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్  ఆధ్వర్యంలో     మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు నూతన జీవం..

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 24/: గొప్పగా పునఃప్రారంభం — గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాసు ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు నూతన జీవం
తాజ్‌పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాసు మాట్లాడుతూ స్వంత నిధులతో సమగ్రంగా పునరుద్ధరించి బుధవారం ఘనంగా పునఃప్రారంభించారు. సర్పంచ్ సుమారు రూ.16 లక్షల స్వంత ఖర్చుతో పాఠశాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
పునరుద్ధరణలో కంప్యూటర్ ల్యాబ్, LED డిజిటల్ క్లాస్ స్క్రీన్‌లు, వైఫై మరియు CC కెమెరాల ఏర్పాటు, ఆధునిక టాయిలెట్లు, RO ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్‌లు వంటి సాంకేతిక, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాక, మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంచి, మంచి క్రీడా వసతులు, విద్యా విజ్ఞాన చిత్రపటాలు, నూతన నాణ్యమైన ఫర్నిచర్‌, విస్తృత వంటగది పునఃరూపకల్పన కూడా చేశారు. అదనంగా ఆటో వెహికల్ పార్కింగ్ ఏర్పాటు, అవసరమైతే అదనపు వాలంటీర్ నియామకం వంటి పాఠశాల నిర్వహణల చర్యల ద్వారా పాఠశాలను ఒక కార్పొరేట్ పాఠశాల లెవల్‌కి తీసుకొచ్చినట్లు తెలిపారు.
పునఃప్రారంభ వేడుకకు జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు , విద్యార్థుల తల్లిదండ్రులు విద్యావంతులు వివిధ వర్గాల నుండి భారీగా హాజరయ్యారు. ముఖ్య అతిథు తులు ZP CEO శ్రీమతి శోభారాణి, DEO శ్రీ భిక్షపతి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవైస్ చిస్తీ, సామాజిక వేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, MEO శ్రీ రంగరాజన్, ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు మరియు పాఠశాల అధ్యాపక బృందం, కళాకారుల బృందం తదితరులు. పాల్గొన్నారు
వైభవంగా జరిగే కార్యక్రమాన్ని జ్యోతి ప్రজ্জ్వలనం ద్వారా ప్రారంభించి, వివిధ సాంకేతిక విభాగాల అధికారిక ప్రారంభోత్సవాలు చేశారు, సర్పంచ్ కృషి వల్ల పాఠశాలలో విద్యార్థుల రేఖ కూడా గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
, పలువురు నాయకుల అభినందనలు తెలిపారు , సర్పంచ్ గారి సామాజిక బాధ్యతకు పాఠశాల మార్పు అని ప్రజలు పేర్కొన్నారు. సర్పంచ్ గారి ఈ ఘన ప్రయత్నం ద్వారా గ్రామంలోని విద్యాశాఖకు సరైన దిశగా మైలురాయి చేరిందని స్థానికులు భావిస్తున్నారు.