గజ్వేల్ నియోజకవర్గం, 24 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /
సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 2వ వార్డు సభ్యులు అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో ఈ నోట్‌బుక్స్ పంపిణీ చేసినట్లు అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల పోచయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా తోడ్పాటునందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వివిధ వార్డుల సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.