royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి జాలిగామ గ్రామంలో ఘనంగా ‘మహిళా సభ’సర్పంచ్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:08 pm
Date of Publish : 24 Jun 2026, 6:39 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 66 💬 7
Latest News > సిద్దిపేట

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి జాలిగామ గ్రామంలో ఘనంగా ‘మహిళా సభ’సర్పంచ్ తాళ్ళ సునీత ఆంజనేయులు గౌడ్

మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి జాలిగామ గ్రామంలో ఘనంగా ‘మహిళా సభ’సర్పంచ్ తాళ్ళ సునీత ఆంజనేయులు గౌడ్

సర్పంచ్ తాళ్ళ సునీత ఆంజనేయులు గౌడ్గజ్వేల్ నియోజకవర్గం, 24 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /

రాయల్ పోస్ట్ న్యూస్ సిద్దిపేట గాజ్వెల్ జూన్ 24/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ‘మహిళా స్నేహ పూర్వక గ్రామం’ నిర్మాణంలో భాగంగా ప్రత్యేక "మహిళా సభ"ను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తాళ్ళ సునీత ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాళ్ళ సునీత ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మహిళల సాధికారతతోనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ముఖ్యంగా విద్యా, ఉపాధి రంగాలతో పాటు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో మహిళలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలో ఇంకా కొనసాగుతున్న స్త్రీ, పురుష వివక్షను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలు వెనుకబడి ఉండకుండా, అన్నింటా ముందు వరుసలో నిలిచి తమ ప్రతిభను చాటుకోవాలని సర్పంచ్ ఆకాంక్షించారు. జాలిగామ గ్రామాన్ని మహిళా స్నేహ పూర్వక గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమురయ్య, గ్రామ సెక్రెటరీ మహమ్మద్ అజారుద్దీన్, వార్డు సభ్యులు, చిట్యాల ఎల్లం, మంకిడి కరుణాకర్, నాయక మనోహర్, రసముల కర్ణాకర్, నాని, గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.