royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaరిపోర్టర్ నర్సింలు ను పరామర్శించిన టిజేయు నేతలు › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:25 pm
Date of Publish : 22 Jun 2026, 12:50 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 97 💬 11
Latest News > తెలంగాణ > సిద్దిపేట

రిపోర్టర్ నర్సింలు ను పరామర్శించిన టిజేయు నేతలు

రిపోర్టర్ నర్సింలు ను పరామర్శించిన టిజేయు నేతలు

రిపోర్టర్ నర్సింలు ను పరామర్శించిన టిజేయు నేతలు

రాయల్ పోస్ట్ న్యూస్ జూన్ 22/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన రిపోర్టర్ నర్సింలు రెండవ కుమార్తె రాగిని ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించగా ఆదివారం రిపోర్టర్ నర్సింలు ను పరామర్శించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య నర్సింలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, చిన్నారి రాగిని మరణం బాధాకరం అని, నర్సింలు కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని వారికి మనోధైర్యం కల్పించారు, యువత సెల్ ఫోన్ కు బానిస అయి చదువును పక్కనపెట్టి, ఉజ్వల భవిష్యత్తును మధ్యలోనే క్షణిక ఆవేశంతో ఎంతోమంది యువతీ యువకులు మరణిస్తున్నారని ఈ విషయం ఎంతో బాధాకరమని, తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు తిరిగి పెద్దవారై వారికి ఆసరాగా నిలవాల్సిన వారు ఇలా మభ్యంతరంలోనే కొంత మంది తనువు చాలించడం కన్నవారికి ఎంతో బాధ కలిగిస్తుందని, యువతి యువకులు బాధ్యతాయుతంగా మెలగాలని అన్నారు