రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 21/ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు అమరజీవి కామ్రేడ్ వేముల మహేందర్ గారి 5వ వర్థంతి స్ఫూర్తితో జిల్లాలో కూలీ, భూమి పోరాటాలు ఉదృతంగా నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుచున్న రాష్ట్ర 4వ మహాసభలలో పాల్గొంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా నాయకత్వం కామ్రేడ్ వేముల మహేందర్ గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకట్రాములు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ వేముల మహేందర్ గారు చిన్ననాటి నుండి ఎర్రజెండ చేతబట్టి వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో ఆనాడు గ్రామీణ స్థాయిలో జీతాలున్న జీతాలు పెరగాలని ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. సామాజిక అణిచివేతకు గురవుతున్న దళితుల పక్షాన నిలబడి దళితవాడల అభివృద్ధి కోసం, సబ్ ప్లాన్ చట్టం సాధన కోసం, జస్టిస్ పున్న కమిషన్ కోసం జరిగిన ఉద్యమాల్లో కూడా మహేందర్ గారి పాత్ర గొప్పదని తెలిపారు. వారి పోరాట స్ఫూర్తిని గ్రామ గ్రామాన పేదల అభివృద్ధి కోసం జరిగే పోరాటాల ద్వారా ముందుకు తీసుకుపోవాలని కార్యకర్తలకు వారు సూచించినారు. కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య, మహిళ కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ, జిల్లా అధ్యక్షులు జల్లెల పెంటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ , రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, గంగాదేవి సైదులు, రాచకొండ రాములమ్మ జిల్లా ఉపాధ్యక్షులు సిరిపంగి స్వామి, గుంటోజి శ్రీనివాస చారి, సహాయ కార్యదర్శి జూకంటి పౌల్, జిల్లా కమిటీ సభ్యులు, దొడ్డి బిక్షపతి, కొండపురం యాదగిరి, బొయ యాదయ్య , మెతుకు అంజయ్య, వల్లంబట్ల శ్రీనివాస్ రావు , మానే సాలయ్య, రాపోతు పద్మ, చింతకాయల నర్సింహ, ప్రసాదం విష్ణు, చింతల సుదర్శన్, యాట బాలరాజు, కందుల హనుమంతు , మేడి ముకుందం, గాడి శ్రీనివాస్, కట్ట రవికుమార్ జిల్లా నాయకులు బొల్లెపల్లి కిషన్, షానకొండ వెంకటేష్, నేర్పండి మహేష్, యాట ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.