royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులే. › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 10:56 pm
Date of Publish : 21 Jun 2026, 5:11 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 111 💬 9
Latest News > తెలంగాణ > మేడ్చల్-మల్కాజిగిరి

ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులే.

ప్రజల  కోసం పోరాడేది కమ్యూనిస్టులే.

రాయల్ పోస్ట్ న్యూస్ ఘట్కేసర్ జూన్ 21/ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థాయి సిపిఐ నాయకుల రాజకీయ శిక్షణ తరగతులు నేడు ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖరరెడ్డి భవన్ సిపిఐ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ తరగతులకు కూనంనేని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా *సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబాశివరావు*. మాట్లాడుతూ
ప్రజల హక్కుల కోసం ఎల్లప్పుడూ మాట్లాడేది, పోరాడేది కమ్యూనిస్టులదే ప్రధాన పాత్ర అని, అందుకే నేడు ప్రజలకు కమ్యూనిస్టుల అవశ్యకత తెలుసుకుంటున్నారని దానికి అనుగుణంగా పార్టీ నాయకులు తమకు తాము తీర్చిదిద్దుకొని కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలు ఏర్పాటు కోసం పనిచెయ్యాలని అన్నారు. వరంగల్ లో గుడిసెలు కూల్చేస్తే వారి తరపున పోరాటం సిపిఐ మాత్రమే చేసిందని,ఇతర ఏ పార్టీలు కుడా మాట్లాడలేదని, పెట్టుబడిదారుల పత్రికలు కనీసం సిపిఐ పోరాటాన్ని చూపించడం లేదని, అయినప్పటికీ సిపిఐ పోరాటం చేసి విజయం సాధిస్తామని అన్నారు.కార్మికుల హక్కుల కోసం,ఇండ్లు లేని నిరుపేదల కోసం,ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం,పెన్షన్ కోసం,రేషన్ కార్డు కోసం ఇలా అన్ని సమస్యలను సిపిఐ పార్టీ తమ బాధ్యత గా తీసుకోని పనిచేస్తుందన్నారు. సిపిఐ నాయకులు బస్తి లేదా స్థానిక పరిస్థితులను నిత్యం తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పని చెయ్యాలని సూచించారు.కమ్యూనిస్టులు లేకపోతే ప్రభుత్వాలను ప్రశ్నించేవారు ఉండరని అలా జరిగితే ప్రజలకు తీవ్ర నష్టం కల్గుతుందని,సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం కమ్యూనిస్టుల అవశ్యకత ఉంటుందని,అసమానతలు,దోపిడి పోవాలంటే మరింతగా చైతన్యం కావాలని కోరారు. సర్ పేరిట బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారని ఆలా జరగకుండా చూడాల్సిన బాధ్యత సిపిఐ పైన ఉందని దానికోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని సిపిఐ పోరాటాలకు పిలుపునిచ్చిందని, వాటిని విజయవంతం చెయ్యాలని అన్నారు.

 ఈ కార్యక్రమంలో  సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసఫ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ,సైకాలజిస్ట్ హరీష్ ఆజాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడీ,సాయిలు గౌడ్,స్వామి,లక్ష్మి, దర్మేంద్ర,శంకర్రావ్, శంకర్,సత్య ప్రసాద్ ,కిషన్,హరినాథ్,నర్సింహా,శ్రీనివాస్,యాదయ్య గౌడ్,మహిళా సమాఖ్య అధ్యక్షులు హైమావతి తో పాటు జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.

ప్రజానాట్యమండలి కళాకారులు తమ పాటలతో చైతన్యం చేశారు.