royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaనర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:20 pm
Date of Publish : 21 Jun 2026, 5:03 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 70 💬 17
Latest News > తెలంగాణ > సిద్దిపేట

నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

గజ్వేల్ నియోజకవర్గం, 21 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన రిపోర్టర్ నర్సింలు ద్వితీయ కుమార్తె రాగిని ఇటీవల క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, బిఆర్‌ఎస్ నాయకులు ఎన్.సి. సంతోష్‌తో కలిసి నర్సింలు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాగిని మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణిక ఆవేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు తల్లిదండ్రులకు కోలుకోలేని శోకాన్ని మిగులుస్తాయని అన్నారు. నేటి యువతీ యువకులు నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా, చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పుట్టెడు దుఃఖంలో ఉన్న రిపోర్టర్ నర్సింలు కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.