royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవిద్యారంగ సమస్యలు ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులపై ప్రభుత్వం వెంటనే… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:58 pm
Date of Publish : 21 Jun 2026, 12:38 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 74 💬 11
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

విద్యారంగ సమస్యలు ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి..

విద్యారంగ సమస్యలు ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి..

ప్రెస్ నోట్

విద్యారంగ సమస్యలు – ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

  • ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలతోసతమతమవుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయి.
  • జనగామ జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రవేశాల సమయంలో అడ్మిషన్ ఫీజులు,పుస్తకాలు, యూనిఫాం తదితర పేర్లతో అధిక మొత్తాలను వసూలు చేయడం సరికాదు.దీంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.దీని మీద జిల్లా కలెక్టర్ గారూ మరియు DEO గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి.
  • అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, నాణ్యమైన విద్యా ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం అయినప్పుడే ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు లభిస్తాయి.
  • తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిన కూడా ప్రత్యేక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం కళాశాలలో విద్యార్థులకి ఫీజ్ రీయంబర్స్ మెంట్ చెల్లించక పోవడం నిరుద్యోగులకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్స్ విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలకి నిదర్శనం.
  • గతంలో 2009 సంవత్సరం లో RTE ఆక్ట్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు తీసుకురావడం జరిగింది.కానీ ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ప్రైవేట్ విద్యాసంస్థలకి ఊడిగం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
  • ఇప్పటికి అయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణకు పారదర్శక విధానాన్ని అమలు చేయడంతో పాటు తల్లిదండ్రుల ఫిర్యాదులను స్వీకరించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించే విధంగా చర్యలు తీసుకుని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము.