సకల సౌకర్యాల తో సంస్కృతి విద్యా రంగంలో సంస్కృతి స్కూల్ సేవలు ప్రశంసనీయం!
నాణ్యమైన విద్యతో విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు
రాయల్ పోస్ట్ వికారాబాద్ జిల్లా స్థాపర్ జూన్ 20
వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంస్కృతి స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి గుర్తింపు పొందుతోందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
పాఠశాల నిర్వహణకు సంబంధించి అన్ని నిబంధనలను పాటిస్తున్నామని, సంబంధిత శాఖల మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని స్కూల్ ప్రతినిధులు వెల్లడించారు. పాఠశాలపై వస్తున్న కొన్ని ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అవసరమైతే సంబంధిత అధికారులకు పూర్తి వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని యాజమాన్యం తెలిపింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.