శంకర్ పల్లి; జూన్ 19.(రాయల్ పోస్ట్)రానున్న వర్షాకాలం దృశ్య ముందు జాగ్రత్త చర్యలుగా శంకర్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ సాత ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో మున్సిపల్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు సూచించారు. రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే ఉడ్చాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఎత్తుగా పోసిన మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని చైర్ పర్సన్ కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలలో నివసిస్తున్న వారిని వెంటనే ఆ ఇండ్లను ఖాళీ చేయించి మరమ్మతులు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, శంకర్ పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, స్థానిక సీఐ మీర మసద్దరలి, మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ బి. ఆనంద్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.