royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaగజ్వేల్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మార్కెట్ యార్డ్‌లో… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 5:40 pm
Date of Publish : 19 Jun 2026, 9:53 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 93 💬 12
Latest News > తెలంగాణ > సిద్దిపేట

గజ్వేల్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మార్కెట్ యార్డ్‌లో కేక్ కటింగ్, రక్తదాన శిబిరం, అన్నదానం

గజ్వేల్‌లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మార్కెట్ యార్డ్‌లో కేక్ కటింగ్, రక్తదాన శిబిరం, అన్నదానం

గజ్వేల్, 19 జూన్ 2026 (రాయల్ పోస్ట్ న్యూస్ ):సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా గజ్వేల్ మార్కెట్ యార్డ్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ కేక్‌ను కట్ చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని నాయకులు ప్రారంభించారు. పలువురు యువకులు, కార్యకర్తలు ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం పేదలకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్మకుంట నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం అమోఘమని కొనియాడారు. ఈ జన్మదిన వేడుకలను, సేవా కార్యక్రమాలను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వివిధ విభాగాల నాయకులకు, గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలకు మరియు అభిమానులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయమోహన్, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్తా పరుశురామ్, పీసీసీ కార్యదర్శి నెంటూర్ రంగారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా శేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కరుణాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, సీనియర్ నాయకులు సమీర్, కనకయ్య గౌడ్, మల్లేశం, చిట్కుల శివారెడ్డి, నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్యగారి శేఖర్, అయ్యప్ప ఆలయ ప్రధాన కార్యదర్శి అయిత సత్యనారాయణ, కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి బిక్షపతి, మల్యాల భద్రయ్య, మరియాల శ్రీనివాస్, తోట బిక్షపతి, రుక్మయ్య, కాశీనాథ్, సిరిపురం సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, ఉమేష్, నితీష్, వెంకటేష్, పార్టీ మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.