, శంకర్ పల్లి; జూన్ 15.(రాయల్ పోస్ట్తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల శంకర్ పల్లి తాపీ మేస్త్రి యూనియన్ ఎన్నిక సోమవారం శంకర్ పల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి మునిసిపల్ చైర్ పర్సన్ సాతా ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. యూనియన్ ఆఫీస్ ను ఓపెనింగ్ చేయడం జరిగింది. అధ్యక్షులుగా వడ్డే కృష్ణ, ఉపాధ్యక్షులుగా వడ్డే కృష్ణ, ప్రధాన కార్యదర్శి గడ్డం కళ్యాణ్, ఎన్నిక కాగా కోశాధికారిగా కె. నవీన్, సహాయ కార్యదర్శిగా వై. పోతురాజు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బి. కొండలరావు, డి. శ్రీనివాస్, బి. బస్వరాజ్, సిహెచ్. సాయి కిరణ్, పరుసు సుబ్బారావు, డి. మహేష్ గౌడ్, పి.
రవీంద్ర ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తాపీ మేస్త్రి యూనియన్ అధ్యక్షులు వి. కృష్ణ మాట్లాడుతూ. యూనియన్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు తోటి మేస్త్రీలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. మన మేస్త్రీలకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందు ఉండే నడిపిస్తానని. అలాగే మన మేస్త్రీలకు ఎలాంటి సమస్యలు వచ్చినా మన యూనియన్ దృష్టికి తీసుకురావాలని అలాగే ప్రతి నెల అమావాస్య రోజున మనమందరం కలసి సమస్యలు చర్చించుకోవాలని. మండలంలో ఏ గ్రామంలో అయినా స్లాబ్ ఏరియా ఒక ఫీట్ కు రూ.250/- తీసుకోవడం జరుగుతుందని యూనియన్ నిర్ణయించిందని తెలిపారు. ఈ విషయంలో భవన నిర్మాణ యజమానులు సహకరించాలని ఆయన కోరారు.