రాయల్ పోస్ట్ న్యూస్ జూన్ 15/ మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండల విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూళ్లే లక్ష్యంగా అడ్మిషన్ ఫీజు పేరిట, 5000 రూపాయలు వసూళ్లు చేస్తూ కొన్ని పాఠశాలలో డొనేషన్ పేరిట 50,000 రూపాయల వరకు వసూళ్లు చేస్తు పుస్తకాలు, యూనిఫామ్, బెల్ట్,టై లు అత్యధిక డబ్బులకు అమ్ముతూ విద్యార్థులు యాజమాన్యాల దగ్గరనే తీసుకోవాలని ఒత్తిడి చేయడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారని ఆయన అన్నారు మిర్యాలగూడలో ఇంత విచ్చలవిడిగా విద్యా వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధుల పట్టించుకోకపోవడంతో వారి దోపిడి మరింతగా పెరిగిందని ఆయన అన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలను సీజ్ చేయాలని ఆయన అన్నారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానికి సిద్ధమై ఉన్నామని ఆయన హెచ్చరించాడు ఈ కార్యక్రమంలో.. బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు పట్టేటి రమేష్, బీసీ యువజన సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు మునగాల శైలేందర్, యువజన సంఘం నాయకులు లక్ష్మణ్, రాము, శంకర్ తదితరులు పాల్గొన్నారు