రాయల్ పోస్ట్ న్యూస్యా దాద్రి(తుర్కపల్లి) జూన్ 09/ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఉపాధ్యాయులు పలుగుల సతీష్ కుమార్ అన్నారు.మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుర్కపల్లి, దయ్యం బండ తండ గ్రామాల్లో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను, తల్లిదండ్రులను కలిసి పాఠశాలలో నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బీరవెల్లి హరిత ఆదరాసుపల్లి వెంకటలక్ష్మి, సి అర్ పి పెద్దాకుల భాస్కర్ పాల్గొన్నారు