royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaభూ పంపిణీ ద్వారానే ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుంది– మోడీ… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:02 pm
Date of Publish : 09 Jun 2026, 8:20 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 53 💬 1
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

భూ పంపిణీ ద్వారానే ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుంది– మోడీ తీసుకొచ్చిన విబి – జి రామ్ జి చట్టాన్ని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయవద్దు– వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి– చర్చ వేదికలో పాల్గొన్న వక్తల పిలుపు

భూ పంపిణీ ద్వారానే ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుంది– మోడీ తీసుకొచ్చిన విబి – జి రామ్ జి చట్టాన్ని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయవద్దు– వ్యవసాయ కూలీల హక్కుల కోసం పోరాడే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి– చర్చ వేదికలో పాల్గొన్న వక్తల పిలుపు

--

    రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్భూ 9/ పంపిణీ ద్వారానే ఆర్థిక, సామాజిక సమానత్వం వస్తుందని ప్రభుత్వ మిగులు భూముల సాధనకై , భూస్వాములు , గ్రామాల్లోని నయా దనికులు ఆక్రమించుకుంటున్న , పోగు చేసుకుంటున్నా భూములను పేదలకు చెందిన నాడే గ్రామాలలో అన్ని రకాల మార్పులు వస్తాయని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మాజీ నాయకులు బట్టు రామచంద్రయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, పిఎంసి జిల్లా కన్వీనర్ సురుపంగ శివలింగం తెలిపారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో ఈనెల 20, 21 22 తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో " వ్యవసాయ కార్మికులు - పాలకుల వైఖరి " పై  "చర్చా వేదిక " ను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జల్లెల పెంటయ్య అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన నేటికీ లక్షలాదిమంది ప్రజలు సెంటు భూమికి నోచుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఉన్నోడు మరింత ధనికుడిగా పేదోడు మరింత పేదవాడిగా పాలకుల విధానాల వల్ల మారుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు , వివిధ పేర్లతో మళ్లీ భూస్వాములు, నయా ధనికులు వందలాది ఎకరాల ఆక్రమించుకుంటున్నారని, పోగు చేసుకుంటున్నారని విమర్శించారు. ఆ భూములను పేదలకు పంచి నాడే ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోయి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. సొంత భూమి ఉంటే ఆ కుటుంబం ఆ భూమి ఆధారంగా వివిధ అనుబంధ రంగాల ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటారని తెలిపారు. భూమి ఒక శాశ్వత ఆర్థిక రక్షణ ఇస్తుందని తెలిపారు. భూ సామ్య వ్యవస్థలో జరిగే శ్రమ దోపిడీ, అనిచివేతలను అరికట్టడానికి భూమి ఉపయోగపడుతుందని భూమి కోసం ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వము తీసుకొచ్చిన విబి - జిరాంజీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోవాలని, పాత చట్టమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని సూచించారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన, వ్యవసాయ కూలీల పక్షాన, ఉపాధి హామీ కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతూ అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పిస్ జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయక్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి , గంగాదేవి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు సిరిపంగి స్వామి , గుంటోజి శ్రీనివాస్ చారి, సహాయ కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పాల్గొని మాట్లాడగ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు కిషన్ , దొడ్డి బిక్షపతి , బోయ యాదయ్య , వల్లంబట్ల శ్రీనివాసరావు , కొండపురం యాదగిరి , మానే సాలయ్య , చింతకాయల నర్సింహ, అందెల జ్యోతి, చెక్కిళ్ల ఉపేంద్ర , గ్యార అండాలు , చింతల సుదర్శన్ , యాట బాలరాజు, కందుల హనుమంతు , మేడి ముకుందం, గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.