రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి , జూన్ 09 /రెండు సార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు గాదె కవిత నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు . కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇష్టం వచ్చిన రీతిలో గ్యాస్ పైన , పెట్రోల్ పైన , డిజిల్ పైన ధరలు పెంచుకుంటే పోతే ప్రజల ఎట్లా బతకాలని ప్రశ్నించారు . ధరల పెరుగుదల చూస్తుంటే సామాన్య ప్రజలకు కుటుంబ పోషణ బరువై అప్పుల పాలు కాక తప్పదని అన్నారు . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో అచ్చెదిన్ ఏమో గాని చచ్చేదినాలు వచ్చాయని అన్నారు .