royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana. డాక్టర్ బి అర్ అంబేద్కర్ జాతీయ అవార్డు కు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 2:37 pm
Date of Publish : 09 Jun 2026, 7:32 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 27 💬 2
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

. డాక్టర్ బి అర్ అంబేద్కర్ జాతీయ అవార్డు కు బొట్ల రాజేశ్వర్ ఎంపిక

. డాక్టర్ బి అర్ అంబేద్కర్ జాతీయ అవార్డు కు బొట్ల రాజేశ్వర్ ఎంపిక

డా. బి అర్ అంబేద్కర్ జాతీయ అవార్డు కు బొట్ల రాజేశ్వర్ ఎంపిక

రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా
జూన్ 9/యాదాద్రి భువనగిరి జిల్లాబొమ్మలరామారం మండలంలోని జలా ల్పురం గ్రామ లైన్మెన్ గా పనిచేస్తున్న బొట్ల రాజేశ్వర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు 2026 సంవత్సరమునకు ఎంపికైనట్టు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ బొట్ల రాజేశ్వర్ ఒక ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కొరకు హక్కుల సాధనలో భాగంగా ముందుండి అనేక కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలోజూలై 12 తేదీన హైదరాబాదులో అవార్డు అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా రాజేశ్వర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు గ్రామానికి చెందిన తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీగా ఉన్న బొట్ల రాజేశ్వర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో ఉన్న సాహిత్యాన్ని, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుకు తీసుకుపోతున్నందుకు గాను ఈ అవార్డు కు తనను రావడం చాలా సంతోషం ఉందని తెలిపారు. తమతో పని చేస్తున్న తోటి ఉద్యోగి బొట్ల రాజశేఖర్ కు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు రావడం పట్ల యాదాద్రి భువన గిరి జిల్లా ఉద్యోగస్తులు సామాజిక కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు అధికారులు అనధికారులు శుభాకాంక్షలు తెలిపారు.