royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaచట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తో సాధికారత:NFIW › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:18 pm
Date of Publish : 04 Jun 2026, 9:50 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 194 💬 13
Latest News > తెలంగాణ > వనపర్తి

చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తో సాధికారత:NFIW

చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తో సాధికారత:NFIW

రాయల్ పోస్ట్ న్యూస్ వనపర్తి జూన్ 4/ చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం తోనే మహిళా సాధికారత సాధ్యమని NFIW జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి గీత అన్నారు. గురువారం వనపర్తి జిల్లా ఆఫీసులో ఎన్ఎఫ్ఐడబ్ల్యు 72వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.NFIW జెండాను ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ ఆవిష్కరించారు. నేతలు మాట్లాడుతూ. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో కేవలం 33% రిజర్వేషన్ కు చట్టం చేశారని, బిజెపి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో కలిపి పార్లమెంటులో బిల్లు పెట్టి అమలు కాకుండా అడ్డు కొట్టిందని, విడిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. బిజెపి విధానాలు మాటల్లో మహిళలకు అనుకూలంగా చేతల్లో వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు.దేశంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హత్యాచారాలు, హత్యలు, అకృత్యాలు, వేధింపులు నానాటికి పెరుగుతున్నాయని, చాలా తక్కువ కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతుండటంతో నేరాలు పెరిగిపోతున్న అన్నారు. మహిళలు సంఘటితమై నిందితులకు శిక్షలు పడేదాకా పోరాడాలి అన్నారు. బండి భగీరథ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఇతర పార్టీలు ప్రజా సంఘాలు పోరాటంతోనే అరెస్టు చేశారన్నారు. లింగ వివక్ష తగ్గలేదని ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తున్నారని వారిని పుట్టనివ్వాలి ఎదగనివ్వాలి చదవని ఇవ్వాలని, మగ పిల్లలకు దీటుగా, కొన్నిసార్లు చదువు వివిధ రంగాల్లో వారి కంటే బాలికలు పై చేయి సాధిస్తున్నారన్నారు. మగ పిల్లల కంటే ఆడపిల్లలే పుట్టింటికి మెట్టినింటికి గౌరవం చేస్తున్నారన్నారు. ఆస్తుల కోసం మగ పిల్లలు తల్లిదండ్రులను వేధిస్తున్నారని ఆడపిల్లలు బాధ్యతగా తల్లిదండ్రులను పోషిస్తున్నారని ఈ విషయం పెద్దలు గ్రహించాలన్నారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా మారోద్దని అన్యాయం జరిగినప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాడినప్పుడే హక్కులు దక్కుతాయని, న్యాయం జరుగుతుందన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జెండా కింద గ్రామ గ్రామాన మహిళలు ఏకమై మహిళలపై ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.NFIW జిల్లా ఇన్చార్జ్ రమేష్,NFIW జిల్లా ప్రధాన కార్యదర్శి గీత, వనపర్తిపట్టణ కో కన్వీనర్ శిరీష, నేతలుశ్రీదేవి, వెంకటమ్మ, సాయి లీల, నాగమణి, వార్డు మెంబర్ సుజాత, శాన్వి, బబ్బి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.