రాయల్ పోస్ట్ న్యూస్ సూర్యాపేట జూన్ 4/తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా అధ్యక్షులుగా చలమల్ల
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ JAC సూర్యాపేట కో కన్వీనర్ గా 5 సంవత్సరంలు స్వంత పనులు కుటుంబాన్ని పక్కకు పెట్టి నిరంతరం క్రియాశీలకంగా రాత్రింబవళ్లు, ఉద్యమం పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తిని, కేసుల అయి అరెస్టులై అనేక నిద్రలేని రాత్రులు పోలీస్ స్టేషన్ లో గడిపి అనారోగ్యానికి గురిఅయి జైలుకు కూడా వెళ్లి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోనీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధననే అంతిమ లక్ష్యంమని, ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నో వేయా ప్రయాసలకు తట్టుకొని ప్రత్యేక తెలంగాణ సాధించే వరకు ఉద్యమంలో పాల్గొన్న చలమల్ల నర్సింహ ను తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) రాష్ట్ర కమిటీ చైర్మన్ నరాల సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమకారుల వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. నన్ను గుర్తించి తెలంగాణ ఉద్యమకారుల వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానుఉద్యమంలో అమరులైన కుటుంబాలను, ఉద్యమకారులను ఐక్యం చేసి ఉద్యమకారులకు స్వయం ఉపాధి కొరకు 10 లక్షల ఆర్థిక సహాయం, వారి పిల్లలకు ఉచిత విద్యను, తమ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించాలని, 200 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లును నిర్మించి ఇవ్వాలని, నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు, వారి కుటుంబ సభ్యులు అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఉద్యమకారులు పడుతున్న ఇబ్బందులు సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూన్నాను. ఇట్టి deeనివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ దృష్టికి తీసుకుపోతానని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తాననీ హామీ ఇస్తున్నాను.