royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaసమ సమాజ్ పార్టీ (SSP) జిల్లా అధ్యక్షుల నియామకం › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 11:46 pm
Date of Publish : 04 Jun 2026, 9:18 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 92 💬 11
Latest News

సమ సమాజ్ పార్టీ (SSP) జిల్లా అధ్యక్షుల నియామకం

సమ సమాజ్ పార్టీ (SSP) జిల్లా అధ్యక్షుల నియామకం

రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ జూన్ 4/ బొల్గూరి కిరణ్ కుమార్, సమ సమాజ్ పార్టీ (SSP)వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో నూటికి 85% ఉన్న పేదవర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా, మహానీయులు కారల్ మార్క్స్, డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్, పెరియర్ రామస్వామి ల సిద్ధాంత, రాజకీయ వెలుగులో "సమానత్వ వాద" సిద్ధాంతంతో ప్రజలను చైతన్యం చేసి "సమసమాజాన్ని" నిర్మిస్తామని ఆ లక్ష్య సాధనకై సబ్బండ వర్గాలను సిద్ధం చేయుటకై, ప్రజలలో విస్తృత స్థాయిలో పార్టీ "లైను" ను ప్రచారం చేయుటకై, పార్టీని నడిపించుటకై తెలంగాణలోని పలు జిల్లాల అధ్యక్షుల నియామకాలను సమ సమాజ్ పార్టీ (SSP) వ్యవస్థాపక అధ్యక్షులు బొల్గూరి కిరణ్ కుమార్ గారు చేపట్టడం జరిగింది. ఈ నియామకాలు తేదీ: 04 -06-2026 నుండి అమలులోకి వస్తాయని తెలియజేశారు.
SSP జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వారు తక్షణమే జిల్లా కమిటీల, నియోజకవర్గ కమిటీల, మండల కమిటీల, గ్రామ కమిటీల, నిర్మాణంపై దృష్టి సారించాలని, పార్టీ విస్తరణకు, ప్రజా సమస్యల పరిష్కారాలపై, పార్టీ డైరెక్షన్లో ప్రజల చైతన్యంకై కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అధ్యక్షులు - జిల్లాలు
1) బి. నవీన్ కుమార్ - గ్రేటర్ హైదరాబాద్ ( హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల)
2) ఎన్. బాలరాజ్ - నిజామాబాద్ జిల్లా
3) ఎమ్. శ్రీకాంత్ - కామారెడ్డి జిల్లా
4) బి. అనిల్ కుమార్ - నల్లగొండ జిల్లా
5) యు. పరశురామ్ - యాదాద్రి భువనగిరి జిల్లా ఇట్లు
.