(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం జూన్ 04:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో గ్రామ సర్పంచ్ మరియు మహేశ్వరం మండలం సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… జూన్ 4న మిషన్ లైఫ్ నీటి సంరక్షణ, సింగిల్ యాజ్ ప్లాస్టిక్ నిరోధం, విడుదల తగ్గింపు, కిచెన్ గార్డెన్లు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం, (ఏక్ పెట్ మా కె నాన్) అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం పరిశుభ్రత కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా సర్పంచ్ బండారి లింగం ముదిరాజ్ అమ్మ పేరిట ప్రైమరీ స్కూల్లో ఒక మొక్క నాటడం జరిగింది ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఖాళీగా ఉన్న ప్రదేశాలలో గ్రామంలో మొత్తం మొక్కలు నాటే ప్రయత్నం చేయాలన్నారు అంతేకాకుండా గ్రామస్తులతో ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఉంచాలని తెలియజేస్తూ.. పర్యావరణం బాగుంటేనే గ్రామం బాగుంటుందని గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుందని అని అన్నారు.. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు గ్రామంలో తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి ఉంచాలన్నారు వాటిని తీసుకెళ్లడానికి గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బంది వచ్చి తీసుకెళ్తారని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో.. గ్రామ సర్పంచ్ బండారి లింగంతో పాటు.. వార్డు సభ్యులు షాహబుద్దీన్ ఖాన్, నయీమ్ ఖాన్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీశైలం, అంగన్వాడి టీచర్లు నాగమణి, మాధవి, పంచాయతీ కార్యదర్శి ఎస్ జానయ్య పంచాయతీ కార్మిక సిబ్బంది తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది