పాపన్నపేట, జూన్ 1. రాయల్ పోస్ట్;
మండల పరిధిలోని యూసుఫ్ పేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా బెండల పద్మ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు, ఇప్పటివరకు హెడ్మాస్టర్ గా పని చేసిన మాలతీదేవి ఇటీవల పదవి విరమణ చేశారు. దీంతో పద్మ హెచ్ఎం గా మాలతీ దేవి నుండి చార్జి తీసుకున్నారు, ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.