royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమేం అధికారంలోకి రాగానే 111 జీవో ఎత్తివేస్తాం.. గుంపు మేస్త్రీ… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 8:40 pm
Date of Publish : 31 May 2026, 9:16 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 76 💬 16
Latest News > రంగారెడ్డి

మేం అధికారంలోకి రాగానే 111 జీవో ఎత్తివేస్తాం.. గుంపు మేస్త్రీ పాలనపై పోరాటానికి సిద్ధం కావాలి” : కల్వకుంట్ల కవిత పిలుపు..

మేం అధికారంలోకి రాగానే 111 జీవో ఎత్తివేస్తాం.. గుంపు మేస్త్రీ పాలనపై పోరాటానికి సిద్ధం కావాలి” : కల్వకుంట్ల కవిత పిలుపు..

​"

రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 30:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో.. టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నేడు రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. శనివారం ఉదయం ఆమె ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలోని స్వామివారితో పాటు, శివాలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ ప్రజల శ్రేయస్సుకై ప్రార్థించారు.
​అనంతరం మొయినాబాద్ చేరుకున్న కవిత గారు, అక్కడ విప్లవ జ్యోతి డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుమ్మరి శివశంకర్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, జిల్లా ఇంచార్జ్ దూగుంట నరేష్ మరియు అర్చన,కుమార్లతో కలిసి ఆమె తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను ఆవిష్కరించారు.
​ప్రజా గళం వినిపించిన కల్వకుంట్ల కవిత (ముఖ్యమైన ప్రసంగ పాఠం):
​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై మరియు స్థానిక సమస్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల్లో ఎకరా భూమి వంద కోట్ల రూపాయలు పలుకుతోంది. కానీ 111 జీవో కారణంగా 120 గ్రామాల రైతులు నష్టపోతున్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం పావు ఎకరం అమ్ముకుందామన్నా మంచి ధర రాని పరిస్థితి ఉంది. అన్ని పార్టీలు 111 జీవో ఎత్తివేస్తామని హామీ ఇచ్చి మోసం చేశాయి. కానీ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే కచ్చితంగా 111 జీవోను ఎత్తివేస్తుందని నేను ఈ ప్రాంత రైతాంగానికి మాటిస్తున్నాను."
​రియల్ ఎస్టేట్‌ను ఊడగొట్టిన 'గుంపు మేస్త్రీ':
"నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కటే వచ్చు అని చెప్పుకున్న ఈ 'గుంపు మేస్త్రీ' (ప్రస్తుత పాలకుడు) చివరకు ఆ వ్యాపారాన్ని కూడా పూర్తిగా ఊడగొట్టాడు. ఈ ప్రాంతంలో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. వారి పొట్టగొడుతున్న ఈ గుంపు మేస్త్రీ వైఖరిపై చేవెళ్ల, మొయినాబాద్ ప్రజలంతా తిరగబడాలి, పోరాటానికి సిద్ధం కావాలి."
​"తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పోతాయనుకున్నాం, కానీ ఆ లక్ష్యాలు నెరవేరలేదు. తెలంగాణ హక్కులను పరిరక్షించడానికే ఒక కొత్త రాజకీయ శక్తిగా 'తెలంగాణ రక్షణ సేన' పుట్టుకొచ్చింది. మన పార్టీలోకి మైనార్టీలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇక్కడి 'గంగా-జమునా తెహజీబ్' సంస్కృతిని పాడు చేయాలని చూసే శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాలి."
​ఆడబిడ్డల రక్షణ, యువతకు ఉపాధి - శూన్య గ్యారంటీ రుణాలు:
"తెలంగాణ వస్తే ఆడబిడ్డల జీవితాలు మారుతాయనుకుంటే అలా జరగలేదు. మీ ఇంటి ఆడబిడ్డగా, మీ సోదరిగా మీ సమస్యలన్నీ నాకు తెలుసు. ఆడబిడ్డలకు మంచి చేయడానికే నేను ఈ పార్టీ పెట్టాను. మన యువతకు ఉద్యోగాలు రావాల్సి ఉంది. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, ఎలాంటి గ్యారంటీ లేకుండా ₹2 లక్షల నుండి ₹20 కోట్ల వరకు రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం."
​ఈ పర్యటనలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కల్వకుంట్ల కవిత పర్యటనను విజయవంతం చేశారు.