royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaకాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సు సేవలు – డిపో… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 1:01 pm
Date of Publish : 30 May 2026, 10:13 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 27 💬 1
Latest News > తక్షణ వార్తలు > తెలంగాణ > మేడ్చల్-మల్కాజిగిరి

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సు సేవలు – డిపో మేనేజర్ కే. కవిత

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సు సేవలు – డిపో మేనేజర్ కే. కవిత

రాయల్ పోస్ట్ న్యూస్ చెంగిచర్ల , మే 30 : కాలేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చెంగిచెర్ల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సేవలను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ కే. కవిత తెలిపారు. ఈ ప్రత్యేక యాత్రను కాలనీ, పట్టణ వాసులు వినియోగించుకోవాలని కోరారు 35 మందికి పైగా భక్తులు ఉంటే వారు కోరిన చోటునుండే బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.
ఈ యాత్రలో భక్తులను కాలేశ్వరం, పుష్కర ఘాట్, అలాగే భద్రకాళి ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ప్రయాణానికి మెట్రో డీలక్స్ నాన్ ఏసీ బస్సు అందుబాటులో ఉంటుందని చెప్పారు.టికెట్ ధరలు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.600గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికుల కోసం చెంగిచెర్ల, ఉప్పల్ బస్ స్టాప్, మేడిపల్లి ప్రాంతాల్లో పికప్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకొని సరస్వతి పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించాలని డిపో మేనేజర్ కే. కవిత కోరారు. మరిన్ని వివరాల కోసం 91105 05820, 9948886516, 7382823960, 7993291705 నంబర్లను సంప్రదించాలని సూచించారు.