యాదాద్రి(మే 29)వలిగొండ రాయల్ పోస్ట్ న్యూస్ : పాఠశాల విద్యార్థుల పట్ల రేఖల లక్ష్మీనారాయణ చేస్తున్న సేవలు అభినందనీయమని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు.శుక్రవారం ఆయన ఇటీవల వెలువడిన 10 వ తరగతి పలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు లక్ష్మీనారాయణ గారి తల్లి తండ్రులు లక్ష్మమ్మ- రామయ్య ల జ్ఞాపకార్థం నగదు ప్రోత్సాహకాలు అందజేసి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి,ఫలితాలను సాధించి పాఠశాలకు,తల్లితండ్రులకు మంచి పేరు సంపాదించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దాత రేఖల లక్ష్మీనారాయణ,సిపిఎం నాయకులు గాజుల ఆంజనేయులు,చెన్నారం మల్లేశం,చేగురి నగేష్,వేముల నాగరాజు,నారగోని శంకర్,చేగురి గోపాల్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.