royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమహేశ్వరం మండలానికి ఉచిత పాఠ్యపుస్తకాలు చేరిక – జూన్ 1… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:46 pm
Date of Publish : 29 May 2026, 10:18 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 11 💬 0
Latest News > తెలంగాణ > నేటి హెడ్‌లైన్స్ > రంగారెడ్డి

మహేశ్వరం మండలానికి ఉచిత పాఠ్యపుస్తకాలు చేరిక – జూన్ 1 నుండి పాఠశాలలకు పంపిణీ డాక్టర్ వి . కస్నా నాయక్ ఎంఈఓ .మహేశ్వరం

మహేశ్వరం మండలానికి ఉచిత పాఠ్యపుస్తకాలు చేరిక – జూన్ 1 నుండి పాఠశాలలకు పంపిణీ డాక్టర్ వి . కస్నా నాయక్ ఎంఈఓ .మహేశ్వరం

.(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 29:)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలంలోని విద్యార్థులకు 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఉచిత పాఠ్యపుస్తకాలు రామంతాపూర్ బుక్ డిపో నుండి మండలానికి చేరినట్లు మండల విద్యాధికారి వి. కాస్నా నాయక్ తెలిపారు.
మొదటి, రెండో, మూడో, ఆరో మరియు పదో తరగతుల పాఠ్యపుస్తకాలు పూర్తిగా అందినట్లు తెలిపారు. మిగిలిన తరగతులలో నాలుగో తరగతి తెలుగు, ఐదో తరగతి తెలుగు, ఏడో తరగతి ఇంగ్లీష్, ఎనిమిదో తరగతి తెలుగు, గణితం, జీవశాస్త్రం, అలాగే తొమ్మిదో తరగతి ఇంగ్లీష్, హిందీ పాఠ్యపుస్తకాలు తప్ప మిగతా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఈ పాఠ్యపుస్తకాలను జూన్ 1, 2026 (సోమవారం) నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఇక నోటు పుస్తకాలు ఇప్పటికే పంపిణీ చేసినట్లు, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు అవసరమైన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఫ్రీ ప్రైమరీ స్కూల్ కింద… రావిరాల గ్రామంలో.. మరియు తుక్కుగూడ గ్రామంలో.. నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాసులో చెప్పబడును అని తెలిపారు..