royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaతెలంగాణ రాష్ట్ర(BSFI) ప్రధాన కార్యదర్శి గా వల్లపుదాసు ప్రణవ్ ఎన్నిక… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 9:39 pm
Date of Publish : 29 May 2026, 9:45 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 127 💬 18
Latest News

తెలంగాణ రాష్ట్ర(BSFI) ప్రధాన కార్యదర్శి గా వల్లపుదాసు ప్రణవ్ ఎన్నిక…

తెలంగాణ రాష్ట్ర(BSFI) ప్రధాన కార్యదర్శి గా వల్లపుదాసు ప్రణవ్ ఎన్నిక…

రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ మే 29

*నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండల పరిధి లోని తోపుచర్ల గ్రామానికి చెందిన వల్లపుదాసు ప్రణవ్ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా, ఫూలే–అంబేద్కర్–కాన్షీరాం ఆశయాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ, సామాజిక న్యాయం, సమానత్వం, బహుజన సాధికారత కోసం కృషి చేస్తున్న యువ బహుజన నాయకుడు *వల్లపుదాసు ప్రణవ్బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BSFI) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు

విద్యార్థి హక్కులు, సామాజిక చైతన్యం, బహుజన భావజాల ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ప్రణవ్ గారి సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంస్థ నాయకత్వం తెలిపింది

ఈ సందర్భంగా ప్రణవ్ తనపై నమ్మకం ఉంచిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సంఘటితం చేసి బహుజన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు