ప్రజా ప్రతినిధులకు ఏర్పాట్లు కల్పించని పాపన్నపేట తహసీల్దార్
పాపన్నపేట 29 మే, రాయల్ పోస్ట్;
ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో సరిపోని గదిలో తహసీల్దార్ ఏర్పాటు చేయడంపై ప్రజా ప్రతినిధులు,లబ్దిదారులు అసహనం వ్యక్తం చేశారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ గదిలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు చేతుల మీదుగా చెక్కులు అందుకోవాలని వచ్చిన లబద్ధిదారులు ఒకరిపై ఒకరు పడే విదంగా ఉండడంతో ప్రజా ప్రతినిధులు ఆరు బయటే నిలుచొవలసి వచ్చింది.సరిపోని గదిలో వంద మందికిపైగా లబ్ధిదారులతో నిర్వహించిన చెక్కుల పంపిణి కార్యక్రమం అస్తవ్యస్థంగా మారింది.“అరవైలో వంద” అన్నట్లుగా చిన్న సమావేశ మందిరంలో భారీ సంఖ్యలో లబ్ధిదారులను కూర్చోబెట్టడంతో ప్రజా ప్రతినిధులు లబ్దిదారులు, కార్యకర్తలు,తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఎమ్మెల్యే పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా పదేపదే నిలిచిపోవడంతో చీకట్లోనే కార్యక్రమం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.కరెంట్ దోబూచులాటతో లబ్ధిదారులు,అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడ్డారు.సరిపడా ఏర్పాట్లు లేకపోవడంతో కొందరు ప్రజాప్రతినిధులు,మహిళలు సమావేశ మందిరం బయటే నిలబడాల్సి వచ్చింది.
లబ్ధిదారులకు చెక్కులు అందజేసే కార్యక్రమం కోసం ముందస్తు ప్రణాళిక లేకుండా అధిక సంఖ్యలో ప్రజలను పిలవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కనీసం తాగునీరు,ఫ్యాన్లు,విద్యుత్ బ్యాకప్ వంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.