royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఓటు వజ్రాయుధం.. › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:02 pm
Date of Publish : 28 May 2026, 6:17 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 17 💬 2
Latest News > తక్షణ వార్తలు > నల్గొండ

ఓటు వజ్రాయుధం..

ఓటు వజ్రాయుధం..

ఓటర్ మహాశయ వినండి మీరు
ఆధునిక కాలంలో ఓటు అతి శక్తివంతమైన అస్త్రం
మీరు వేసే ఓటు విలువ ఆయుధం మాదిరి
సమాజ మార్పు సంకేతం ఓటు
రాజ్యాంగ రక్షకులు మీరే ఓటర్లు
ప్రతి ఐదు సంవత్సరాలకు పని పట్టాలి పాలకులను
ఐదు సంవత్సరాలకు మార్చాలి నాయకున్ని
పార్లమెంటు సుప్రీంకోర్టు కాదు రక్షణ
పాలకులు పక్కదారి పట్టినప్పుడు
దండించాలి ఓటు అనే ఆయుధంతో
ప్రజాస్వామ్యం పర్యాసంగా మారింది
ఓటు తూటాయి వదలాలి బాణం
ప్రజాస్వామ్య పరిరక్షకులు మీరే అండి
ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి నిజ నిజాలు
భారత ఓటర్లను బాధించిన నాయకులు ఎందరో
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న పాలకులు
రాజ్య పాలకున్ని కపటాన్ని కనిపెట్టాలి
దోపిడీ పాలకులను దొరకబెట్టాలి
మాటల గారడే నీ మన్నించవద్దు
దోచుకోవడం దొంగల దారి
డబ్బు ముఖ్యం కాదు సంక్షేమం సరి
భవిష్యత్ తరాలు బంగారు బాటలు మీ ఓటు హక్కు
యువ ఓటర్లారా రాజ్య భవిష్యం మీరే
పార్టీలన్నీ కూడా ఓట్లు దోచుకోవడానికి
పథకాలు ముఖ్యం కాదు సంక్షేమ పనులు ముఖ్యం
పదవుల కోసం పాకులాడే నేతలందరూ
గెలుపు ప్రధానం గొంతు పరిమళాలు
ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రతిఘటించాలి ఓటర్
వ్యక్తి కాదు ముఖ్యం వ్యవస్థ
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము పరులందరి పదిలం
ఎదిరించాలి పాలకున్ని ఓటర్
ప్రజలే సార్వభౌములు
ఓటర్లు సార్వభౌములు
పాలకులు సేవకులు
ప్రజా సేవకులు వారు
ప్రజాస్వామ్యం సువాసన లాంటిది
కుళ్ళింప చేస్తున్నారు కుటిలాత్ములు
కొంతకాలానికి ధనవంతులుగా మారుతున్నారు పాలకులు
వారి వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉన్నాయా
ఓటు వచ్చిన అప్పటినుండి ఓటు వేస్తారు
మీరెందుకు ధనవంతులుగా మార్చలేరు ఓటర్లారా

కొండ కృష్ణ
9676273325